కావలిసినవి: పాలు - నాలుగు కప్పులు,
నిమ్మరసం- నాలుగు చెంచాలు,
పాలపొడి - పావుకప్పు,
పంచదారపొడి - పావుకప్పు,
నెయ్యి - ఆరు చెంచాలు,
యాలకులుపొడి - చెంచా,
జీడిపప్పలు - రెండు చెంచాలు,
తయారీవిధానం: మందపాటి అడుగున్న పాత్రలో పాలు పోసి పొయ్యి మీద పెట్టాలి. అవి బాగా మరిగాక నిమ్మరసం కలపాలి. కొద్దిసేపటికి దించేసరికి పాలు విరిగి గడ్డగా అవుతాయి. శుభ్రమైన వస్త్రంలోకి పాలను తీసుకొని గట్టిగా కట్టి పైన బరువు పెట్టాలి. రెండు గంటలయ్యాక గట్టిగా ఉన్న చీజ్ తయారవుతుంది. దాన్ని చాకుతో సన్నగా తరిగి.. అందులో పాల పొడి, పంచదారపొడి కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యివేసి పొయ్యి మీద పెట్టాలి. కరిగాక చీజ్ మిశ్ర్మమాన్నివేసి.. నెయ్యి పైకి తేలే వరకూ ఉంచి అందులో యాలకుల పొడి కలిపి దించేయాలి. చల్లారాక ఈమిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. తరవాత చేత్తో నచ్చిన ఆకృ తిలో బిళ్లలుగా చేసుకొని వేయించిన జీడిపప్పతో అలంకరించుకొని తింటే రుచిగా ఉంటాయి.
0 comments:
Post a Comment