Topics :
Home » , » Mawa-Malpua Sweet Dish-Rajasthani Special

Mawa-Malpua Sweet Dish-Rajasthani Special

మాల్ పువా మంచి రుచిలో ఉండాలంటే ? 






తయారి విధానం:

మాల్ పువా అనేది పాలు,మైదా,ఉప్మారవ్వ కలిపి చేసే స్వీట్. దీని తయారు చేసే విధానం చాల తేలిక కానీ కొన్ని 

చిన్న చిన్న జాగ్రతలు తీసుకోకపోతే గట్టిపడిపోవడం, రుచి సరిగ్గా లేకపోవడం లాంటి సమస్యలు తప్పవు. మాల్ 

పువాని నెయ్యిలో వేయించేటప్పుడు పూరిలా పొంగు తుంది. అలాకాకుండా ఉండాలంటే మైదా, ఉప్మారవ్వ 1:2

నిష్పత్తిలో తీసుకోవాలి. ఇందులో వాడేపాలు బాగా చిక్కగా, మీగడతో ఉంటే బాగుంటాయ్. నెయ్యి త్వరగ

వేడెక్కుతోంది కాబట్టి వీటిని వేయించేటప్పుడు మంట తక్కువగా ఉంచి నెమ్మదిగా ఇక, ఈ పిండి చిక్కగా దోశపిండి

తరహాలో ఉండాలి. పంచదార పాకం కూడా మరీ ముదురుగా లేదా లేతగా కాకుండా తీగ పాకం ఉండేలా

 చూచుకోవాలి. ఇవి వేగడానికి మూడు నుంచి ఆరు నిముషాలు పట్టవచ్చు . వీటిని నూనెలో వేసి బంగారురంగులోకి

 వచ్చే వరకు రెండువైపులా తిప్పుతూ వేయించుకోవాలి. ఆ వెంటనే పంచదారపాకం లో వేసేయ్యాలి. ఐయితే పాకం

కూడా గోరువెచ్చగా ఉండేలా చూచుకోవాలి. ఇది ఘుమఘుమలాడే వాసనతో, మంచి రుచిలో రావాలంటే కోవా,

యాలుకలపోడితోపాటు చిటికెడు వేయిoచినా సోంపు పొడి కూడా వేసుకోవచ్చు మాల్ పువా మచి రంగు లో

కనిపించాలంటే పాకం లో కొన్ని కుంకుమపువ్వు రేకులు కూడా వేసుకోవచ్చ.
Share this article :

0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...
 
Copyright © 2011. Nechcheli - All about Women's Life Style - All Rights Reserved
Proudly powered by Blogger