అందంగా కనిపించాలనుకుంటున్నారా..? అయితే స్పూన్ మసాజ్‌ను ట్రై చేయండి..!
స్పూన్ మసాజ్‌ను చేయడం వల్ల ముఖంపై ఉన్న ముడతలు తగ్గిపోయి ముఖం కాంతివంతంగా మారుతుందట. నిత్యం ఈ మసాజ్‌ను చేయడం వల్ల ముఖ సౌందర్యం మరింత పెరుగుతుందట. దీంతో వృద్ధాప్యం వచ్చినా ఎప్పటికీ యంగ్‌గానే కనిపిస్తారట. దీన్ని స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే ఆశ్చర్యకరమైన మార్పులు వస్తాయట. ఈ క్రమంలో స్పూన్ మసాజ్ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
కొద్దిగా ఫేషియల్ మసాజ్ ఆయిల్‌ను ముఖంపై రాయాలి. అనంతరం ఓ చైనీస్ స్పూన్‌ను తీసుకుని ముఖంపై సున్నితంగా, మృదువుగా మసాజ్ చేయాలి. అయితే ఈ మసాజ్‌ను 10 నిమిషాల కన్నా ఎక్కువగా చేయకూడదు. లేదంటే అనుకున్న ఫలితాలు రావు.
కింద ఇచ్చిన వీడియోను చూడడం ద్వారా స్పూన్ మసాజ్‌ను ఎలా చేయాలో వివరంగా తెలుసుకోవచ్చు…
0 comments:
Post a Comment